బీఆర్ఎస్ విజయానికి సమష్టిగా కృషి చేయాలి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతిఒక్కరూ సమష్టిగా కృషిచేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
- అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లాలి
- బూత్‌కమిటీ కోఆర్డినేటర్ల సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా
సారపాక, సెప్టెంబర్ 22: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతిఒక్కరూ సమష్టిగా కృషిచేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. మణుగూరులోని ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో బీఆర్ఎస్ బూత్ కమిటీ కో ఆర్డినేటర్ల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అన్నారు. ప్రతి 100 ఓట్లకు ఒక ఇన్చార్జిని నియమించామని, ఆ ఇన్చార్జి ఆయా ఓటర్లను నిత్యం కలుస్తూ వారి సాదకబాధకాలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. నాలుగు బూత్‌లకు ఒకరి చొప్పున ఉన్న కోఆర్డినేటర్లు.. ఇన్చార్జులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారు. జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎన్నికల మండల కో ఆర్డినేటర్లు, బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, ముత్యం బాబు, అడపా అప్పారావు, వట్టం రాంబాబు, నూకారపు రమేశ్, యాదగిరిగౌడ్, ఎడ్ల శ్రీనివాస్, బొలిశెట్టి నవీన్, పఠాన్ యూసఫ్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

