– రూ.10 లక్షల చెక్కు అందజేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మధిర, ఆగస్టు 15 : చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు ప్రమాదవశాత్తు మున్నేరులో పడి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల చెక్కు మంజూరు కాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఖమ్మం పెరేడ్ గ్రౌండ్లో కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చింతకాని తాసీల్దార్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.