మధిర, జూన్ 20 : ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయ సంక్షేమమే పీఆర్టీయూ ధ్యేయంగా పని చేస్తుందని ఆ సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి ఆర్.రంగారావు తెలిపారు. శుక్రవారం పీఆర్టీయూ మధిర మండల శాఖ ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంఘ సభ్యత్వం, జనరల్ ఫండ్ క్యాంపెయిన్‌ను రామచంద్రాపురం, జాలిముడి మల్లారం, సిరిపురం, మాటారు, మర్లపాడు నిదానపురం, జిలుగుమాడు పాఠశాలల్లో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పబ్లిక్ స్కూల్ స్థాపన పేరుతో పాఠశాలలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పాఠశాలలనే అభివృద్ధి చేసి, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. సీపీఎస్ రద్దు, ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలుకూరి సత్యనారాయణరెడ్డి, పోలె సుధాకర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆర్.బ్రహ్మారెడ్డి, జిల్లా బాధ్యులు సీహెచ్.వి.రవికుమార్, కొమ్ము శ్రీనివాసరావు, రాష్ట్ర బాధ్యులు ఎస్కే మదార్, తూమాటి కృష్ణారెడ్డి, నాయకులు కొలగాని ప్రసాదరావు, కె.శాంతబాబు, మల్లెల శ్రీనివాస్, ఎం.బాబు రాజా, డి.శ్యామల రావు, ఎం.నాగేశ్వరరావు, రుద్రపోగు శ్రీను, జి.కేశవులు పాల్గొన్నారు.