కారేపల్లి, మే 20 : అర్హులైనవారందరికి ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యర్రా బాబు అన్నారు. మంగళవారం కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి, భాగ్యనగర్తండాల్లో సీపీఐ గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభల్లో పాల్గొన్న యర్రా బాబు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అరోపణలపై ప్రభుత్వం స్పందించాలని, గ్రామ సభలోనే లబ్ధిదారుల ఎంపిక పక్రియ చేపట్టాలన్నారు. రైతు భరోసాపై ఎన్నో ఆశలతో రైతులు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. రుణమాఫీ కాక, రైతు భరోసా రాక రైతులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారన్నారు.
మహిళ సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏపూరి లతాదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ద, అభివృద్ధిపై పెడితే సంతోషించేవారమన్నారు. మహిళల హక్కులకు భంగం కలుగుతున్నా పాలకులు అందాల పోటీలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. భాగ్యనగర్తండా శాఖ కార్యదర్శిగా ఇస్లావత్ అమృ, సహాయ కార్యదర్శిగా రెడ్డిబోయిన రవిను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రావి శివరామకృష్ణ, ఉంగరాల సుధాకర్, పుచ్చకాయల శ్రీనివాసరావు, గుగులోతు మాంగు, సయ్యద్ అమీర్, కోటమ్మ, లకావత్ కృష్ణ, ఇస్లావత్ బాలాజీ, లకావత్ హరిదాస్, బోడ బద్రు, వాంకుడోత్ కౌలియా, గుగులోత్ రావు, మాలోత్ బాలాజీ పాల్గొన్నారు.