‘పాలేరు’లో పరాయి వాళ్లకు చోటులేదు..
అభివృద్ధి చేసిన ప్రభుత్వానికే పట్టం కట్టాలని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చునని అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం పర్యటించిన ఆయన..
- అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టండి
- తద్వారా మరింత అభివృద్ధికి బాటలు వేయండి
- ఖమ్మం రూరల్ పర్యటనలో బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ
ఖమ్మం రూరల్, నవంబర్ 27: అభివృద్ధి చేసిన ప్రభుత్వానికే పట్టం కట్టాలని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చునని అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం పర్యటించిన ఆయన.. ఎంవీపాలెం, వెంకటగిరి, కాచిరాజుగూడెం తదితర గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనకు మరోసారి అత్యధిక మెజార్టీ అందించాలని, తద్వారా కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. పాలేరు నియోజకవర్గంలో పరాయి వాళ్లకు చోటు ఇవ్వవద్దని కోరారు.
గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్క రోజూ ఓ ఒక్క నాయకుడూ ఇక్కడికి వచ్చి ఇక్కడి ప్రజల బాగోగులు పట్టించుకోలేదని విమర్శించారు. స్థానికుడినైన తాను అక్కడి ప్రజలకు తోడుగా నిలిచానని, వారి కష్టసుఖాల్లో అండగా నిలబడ్డానని, తన శక్తి మేరకు వారికి సహాయ సహకారాలు అందించానని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని అన్నారు. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుల మాటల గారడికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తాళ్లూరి జీవన్‌కుమార్, బెల్లం వేణుగోపాల్, యండపల్లి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

