ఖమ్మం, సెప్టెంబర్ 15: గణేశ్ నిమజ్జన కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో సోమవారం వైభవంగా జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఖమ్మం కలెక్టర్, కేఎంసీ కమిషనర్ పర్యవేక్షించారు. కాగా, ఖమ్మంలో కొలువైన గణనాథులను ఏయే మార్గాల ద్వారా నిమజ్జనానికి తీసుకెళ్లాలనే రూట్‌మ్యాప్‌ను సీపీ సునీల్‌దత్ ఇప్పటికే ప్రకటించారు.
గాంధీచౌక్‌లోని ప్రత్యేక వేదిక నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు శోభాయాత్రను ప్రారంభించనున్నారు. శోభాయాత్ర వేదికను కూడా అధికారులు సిద్ధం చేశారు. లైసెన్స్ కలిగిన డ్రైవర్లను మాత్రమే వాహనం నడిపేందుకు అనుమతించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకే మండపాల నిర్వాహకులు ఊరేగింపు వేడుకులను ప్రారంభించుకోవాలని సూచించారు.