ఖమ్మం, అశ్వాపురం/ మామిళ్లగూడెం/ భద్రాచలం, అక్టోబర్ 2 : మహాత్ముడి జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. ఆయన సాగించిన అహింసామార్గం అందరికీ అనుసరణీయమని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో బుధవారం వేడుకలు నిర్వహించారు.
11
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అతి సామాన్య కుటుంబంలో జన్మించిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ.. ప్రపంచ అత్యున్నత విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తిచేశారని గుర్తుచేశారు. శాంతి, అహింసామార్గం ద్వారానే దేశ స్వాతంత్రోద్యమాన్ని ముందుకు నడిపించారని జ్ఞప్తికి తెచ్చారు. కాగా, బాపూజీ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేశ్ వి పాటిల్, భద్రాచలంలో ఐటీడీఏ పీవో రాహుల్, ఖమ్మంలో సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ తదితరులు మహాత్ముడి విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.