ఖమ్మం: ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధీ152వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రభుత్వ, ప్రైయివేటు కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజలు కుల, మతాలకు అతీతంగా పూజించే వ్యక్తి గాంధీ అని అన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని చెప్పారు. దేశానికి స్వేచ్చ కోసం కుల, మతాలకు అతీతంగా అందరూ పోరాడారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమాలలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మంత్రి పీఏ చిరుమామిళ్ల కిరణ్, టిఆర్ఎస్ కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసి కృష్ణ, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, టిఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, మాజీ అధ్యక్షులు కమర్తపు మురళి, నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్డెల్లి లెనిన్చౌదరి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కుర్రా భాస్కర్‌రావు, మహిళా విబాగం అధ్యక్షురాలు తన్నీరు శోభారాణి, నాయకులు కొల్లు పద్మ, తాజుద్దీన్, స్వరూపరాణి, షకీనా,జక్కుల లక్ష్మయ్య, ఫరీద్ ఖాధ్రి, పగడాల నరేందర్, డోకుపర్తి సుబ్బారావు, శేషు, కనకం భద్రయ్య, మాటేటి కిరణ్, బుర్రి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.