పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి
ప్రభుత్వం గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామేపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ధర్నా నిర్వహించారు.
- కామేపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా
కారేపల్లి (కామేపల్లి), జూన్ 24: ప్రభుత్వం గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామేపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ధర్నా నిర్వహించారు. తొలుత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా హరిప్రియానాయక్ మాట్లాడుతూ గ్రామపంచాయతీకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయన్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పేదలకు దక్కాల్సిన ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీలు తమకు అనుకూలంగా ఉన్న వారికి మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మండల పరిషత్ కార్యాలయంలో అందజేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు అంతోటి అచ్చయ్య, ఒడియాల కృష్ణారెడ్డి, మల్లెంపాటి శ్రీనివాసరావు, నాయకులు కాట్రాల్ రాంబాబు, సామ మోహన్రెడ్డి, బట్టు శంకర్, మూడు కృష్ణప్రసాద్, మాజీ వైస్ ఎంపీపీ అజ్మీరా రాజు, మాజీ సర్పంచ్ జాటోతు లూసి, ముత్యం రామకృష్ణ, అంగడాల అనంతరాములు, కంపసాటి సురేశ్, కన్నమాల రాంబాబు, మంచాల వెంకన్న, దుద్దుకూరు రాంబాబు, ఆదూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- BRS
- Funds
- panchayats
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

