మధిర, అక్టోబర్ 03 : ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని మధిర ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి మధిర మండల ఆర్యవైశ్య సంఘం విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు వనమా వేణుగోపాలరావు (సూరి) నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌కు డిప్యూటీ సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా మధిర మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చారుగుండ్ల నరసింహమూర్తి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల అభివృద్ధి, సంక్షేమానికి కార్పొరేషన్‌కు నిధులు అత్యవసరం అన్నారు. దీని ద్వారా అనేకమంది యువకులకు స్వయం ఉపాధితో పాటు విద్యావకాశాలు మెరుగుపడతాయన్నారు.
ఈ సమావేశంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావు, మిర్యాల వెంకటరమణ గుప్తా, దేవిశెట్టి రంగారావు, మధిర టౌన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వనమా కిరణ్ కుమార్, కోశాధికారి వేములపల్లి శ్రీనివాసరావు, మండల మాజీ అధ్యక్షుడు పల్లపోతు ప్రసాదరావు, కుంచం కృష్ణారావు, నేరెళ్ల శ్రీనివాసరావు, కాజా శ్రీనివాసరావు, ఇరుకుళ్ల సురేశ్, వనమా పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.