Karepalli | మట్టిని అక్రమంగా తరలిస్తున్న నాలుగు టిప్పర్లు స్వాధీనం
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గుట్ట కిందగుంపు శివారులో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్ లారీలను బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
కారేపల్లి,మార్చి 18 : ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గుట్ట కిందగుంపు శివారులో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్ లారీలను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా మైనింగ్ ఏడీ సాయినాథ్ తెలిపారు. గత కొన్ని రోజులుగా గుట్టకిందగుంపు గ్రామ శివారులోని అడవి గుట్ట ప్రాంతంలో జేసీబీలతో తవ్వకాలు చేస్తూ అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో రైడ్ చేసినట్లు చెప్పారు.
మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్లను అదుపులోకి తీసుకొని కారేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు. టిప్పర్లు మట్టి లోడుతో కారేపల్లి-ఇల్లెందు రోడ్డు మార్గం గుండా వాహనదారులకు ఇబ్బందులు కలిగించేలా ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. వాహన యజమానులపై మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్ తో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ బైరు గోపి కేసు నమోదు చేసినట్లు ఏడీ పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

