కారేపల్లి, జూలై 06 : కారేపల్లి మండల కేంద్రంలో గల ఓ ప్రభుత్వ గురుకుల కళాశాల నుండి ఇంటర్ చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు కాగా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కారేపల్లి ఎస్ఐ గోపి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ దుర్గాభవాని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఖమ్మం పట్టణంలోని టేకులపల్లి ప్రాంతంలో నివాసముంటూ నిందితుడికి సహకరించిన మరో ముగ్గురు మహిళలను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.