పాపన్నగౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను ముందు కు తీసుకువెళ్లడంతోపాటు గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నాయకులంతా ఐక్యంగా పోరాడాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపు ఇచ్చారు.
- జనగామ జిల్లాకు పాపన్నగౌడ్ పేరుపెట్టాలి
- గీత కార్మికులపై ఎక్సైజ్ దాడులు ఆపాలి
- మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
రవీంద్రభారతి, ఆగస్టు 10 : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను ముందు కు తీసుకువెళ్లడంతోపాటు గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నాయకులంతా ఐక్యంగా పోరాడాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపు ఇచ్చారు. జైగౌడ్ ఉద్యమం- జాతీయ కమిటీ, శ్రీ సర్దార్ పాపన్న మహరాజ్ ధర్మపరిపాలన సంస్థ(ఎస్పీడీపీవో)ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376 జయం తి వేడుకలు సోమవారం రవీంద్రభారతి లో ఘనంగా నిర్వహించారు.
జైగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావుగౌడ్ సభా అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, కర్ణాటక సీఎం ఓఎస్డీ, ఉత్తప్రదేశ్ పీసీసీ మాజీ చీప్ అజయ్లొల్లు, గౌడ్ ఐక్యసాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, బీసీ ఫ్రంట్ చై ర్మన్ బాలగోని బాల్‌రాజ్‌గౌడ్ హాజరై పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. అప్పటి సీఎం కేసీఆర్ పాపన్నగౌడ్ జయంతి, వ ర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని జీవో ఇచ్చారని గుర్తుచేశారు. గీతకార్మికులపై ఎక్సైజ్ దాడులు ఆపాలని డిమాండ్‌చేశారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జిల్లాగా పేరుపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

