మధిరరూరల్, డిసెంబర్ 8 : కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధే.. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపిస్తుందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ధీమా వ్యక్తం చేశారు. అల్లినగరం, వంగవీడు గ్రామాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థుల గెలుపు కోసం ఆయా గ్రామాల ముఖ్య నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు.
అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార శైలి, ఓటర్లను కలుపుకుపోయే విధానం గురించి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మధిర మారెట్ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు అరిగే శ్రీనివాసరావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, ఆళ్ల నాగబాబు, పరిశ శ్రీనివాసరావు, చిదిరాల రాంబాబు, అబ్దుల్ ఖురేషి, దిల్, సర్పంచ్, వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు.