ఖమ్మం, ఆగస్టు 14 : భారతదేశానికి స్వాతంత్య్రం.. ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితమని బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ పాలకుల చేతుల్లో బందీ అయిన మన దేశాన్ని విముక్తి చేయడానికి స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు మరువలేనివన్నారు.
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టడానికి ప్రాణాలను సైతం లెకచేయకుండా పోరాడిన ఆ పోరాటవీరులు, జాతీయ ఉద్యమనాయకుల దేశభక్తి వల్లే మనకు స్వాతంత్య్రం లభించిందని పేరొన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటానికి నాటి స్వాతంత్య్ర పోరాటమే స్ఫూర్తి అని పేర్కొన్నారు.