చర్ల, మే 23 : ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీఆర్ఎస్ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి బాలసాని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మంగళవారం చర్లలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించేలా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. అందుకు ఇప్పటినుంచే ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయభేరీ మోగించి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరే అవుతారని పేర్కొన్నారు.
భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి ముందు బాలసాని విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాటి ఫలితాలను వివరించారు. రైతులను అక్కున చేర్చుకుని వారి సమస్యలు పరిష్కరిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు.
సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, మండల అధ్యక్ష, కార్యదర్శులు సోయం రాజారావు, నక్కిబోయిన శ్రీనివాసయాదవ్, చర్ల సహకార సంఘ అధ్యక్షుడు పరుచూరి రవికుమార్, చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, రైతు సమన్వయ సమిటీ జిల్లా నాయకుడు కుమార్‌రాజా, మండల ప్రచారకార్యదర్శి కొటేరు శ్రీనివాసరెడ్డి, రైతుసంఘ నాయకుడు పోలిన రామచంద్రరావు, లంకారాజు పలువురు ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కొప్పినీడు బాబూరావు పాల్గొన్నారు.