రైతును దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
వరి పంట వేయకుండా పామాయిల్ సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల రైతులకు సూచించడం చూస్తుంటే.. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
- కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
- సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
వేంసూరు, ఏప్రిల్ 5: వరి పంట వేయకుండా పామాయిల్ సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల రైతులకు సూచించడం చూస్తుంటే.. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భరణిపాడు గ్రామంలో బాబూ జగ్జీవన్‌రాం విగ్రహావిషరణ అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను మోసం చేయకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, బోనస్ పకన పెడితే కనీసం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకుండా చేసిందని ఆరోపించారు. మిల్లర్లతో కుమ్మకై ధాన్యం ధరలను తగ్గించారని, రైతులు క్వింటాల్‌కు రూ.500 వరకు నష్టపోతున్నారని తెలిపారు. మొకజొన్న పంటకు కొనుగోలుదారులు లేకపోవడంతో రైతులు క్వింటాల్‌కు రూ.800 వరకు నష్టాన్ని చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని, కొనుగోలు కేంద్రాలను నామమాత్రంగా నిర్వహించాలని ఆదేశాలు ఇస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు రైతుభరోసా కూడా పూర్తిస్థాయిలో అందించలేదని మండిపడ్డారు. రైతుల సమస్యలను వెంటనే పరిషరించి, మద్దతు ధరలకు పంటలను కొనుగోలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

