కారేపల్లి, మార్చి 17 : కారేపల్లి మండల పరిధిలోని వెంకిట్యాతండా బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బానోత్ భాస్కర్ అనారోగ్యానికి గురయ్యాడు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ సోమవారం భాస్కర్ ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా చీమలపాడు గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో కాలును కోల్పోయిన గిద్దెవారిగూడెంనకు చెందిన ఆంగోత్ కుమార్ను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్వాపురం, కారేపల్లి క్రాస్ రోడ్, గాదేపాడు, ఎర్రబోడు గ్రామాల్లో పర్యటించి పలువురిని పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాస్, మాజీ సర్పంచులు భూక్య రంగారావు, మాలోత్ కిశోర్, కురసం సత్యనారాయణ, నాయకులు పర్సా పట్టాభిరామరావు, నర్సింగ్ శ్రీనివాసరావు, బత్తుల శ్రీనివాసరావు, బానోతు రామ్మూర్తి నాయక్, అడపా పుల్లారావు, బానోతు రూప్లా, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వాంకుడొత్ నరేశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.