సారపాక/ బూర్గంపహాడ్/ కరకగూడెం, ఫిబ్రవరి 3: బూర్గంపహాడ్ మండలంలోని ఇరవెండి గ్రామంలో తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్ చైర్మన్ పంచాక్షరయ్యను మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావుకు పంచాక్షరయ్య శాలువా కప్పి సత్కరించారు. హరీశ్‌రావు కూడా తాళ్లూరిని సత్కరించారు. ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు.
బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలోని జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఇంటికి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను జడ్పీటీసీ శ్రీలత సత్కరించారు. బీఆర్ఎస్ నాయకులు బిక్కసాని శ్రీనివాసరావు, జలగం జగదీశ్, వల్లూరిపల్లి వంశీకృష్ణ, పోతిరెడ్డి గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక భర్త రేగా సత్యనారాయణ ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. మండలంలోని కుర్నవల్లిలో ఉన్న ఆయనను మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం పరామర్శించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు.