KTR On Womens Day | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహిళలను కేవలం కుటుంబ బంధాలతో ముడిపెట్టి చూడకుండా, వారిని స్వతంత్ర వ్యక్తులుగా, తోటి మనుషులుగా గౌరవించాలని ఆయన కోరారు.
”మహిళలను తల్లులు, సోదరీమణులు లేదా కూతుళ్లు కాబట్టి గౌరవించకండి.. వారు తోటి మనుషులు కాబట్టి వారిని గౌరవించండి. వారు కూడా అందరిలాగే సమానమైన గౌరవం, హుందాతనం దక్కాలని మనం మనస్ఫూర్తిగా అంగీకరించిన రోజే ఈ ప్రపంచం నివసించడానికి ఒక మెరుగైన ప్రదేశంగా మారుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. మహిళలు తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం లేని పరిస్థితి రావాలని, అందుకోసం పురుషులంతా మెరుగైన మగవారిగా (Better Men) మారుతామని ఈ మహిళా దినోత్సవం నాడు ప్రతిజ్ఞ చేయాలని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సమాజంలోని బలమైన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, వారి శక్తి మరియు ప్రభావం మరింత పెరగాలని కేటీఆర్ ఆకాంక్షించారు