ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు విధిగా పాటించాలి
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు విధిగా పాటించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే ని ఘనంగా నిర్వహించారు.
- అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మం సిటీ, ఏప్రిల్ 6: ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు విధిగా పాటించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే ని ఘనంగా నిర్వహించారు. తొలుత అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఆహార భద్రత ప్రమాణాల గురించి ప్రజలు, ఫుడ్ వ్యాపారుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందన్నారు. నిరంతరం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ర్యాలీ పటేల్ స్టేడియం నుంచి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు కొనసాగింది. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ డీ రామారావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ కేసగాని రాజశేఖర్‌గౌడ్, డీవైఎస్వో తుంబూరు సునీల్‌రెడ్డి, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్, సూపర్వైజర్ జడ్ఎస్ జయపాల్, బిట్టా ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఖమ్మం పెద్దాసుపత్రిలో..
ఖమ్మం నగరంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని స్థానిక వైద్యాధికారులు, సిబ్బంది కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బీ కిరణ్‌కుమార్, ఆర్ఎంవో డాక్టర్ బీ రాంబాబు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రాంప్రసాద్, నర్సింగ్ సూపరింటెండెంట్ రోజా, లక్ష్మి, ఈ మేరి, పద్మ, రవికిషోర్, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

