కారేపల్లి(కామేపల్లి) : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident) ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం పట్టణం బల్లేపల్లి నుంచి బానోత్ చిట్టిబాబు,బానోతు కవిత, భూక్య విజయ, ధరావత్ సుశీల, సత్యవతి కారులో ( Car ) ఖమ్మం నుంచి ఇల్లెందు వైపు వెళ్తున్నారు.
ఖమ్మం మార్గంలోని పండితాపురం సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారును ఇల్లెందు వైపు నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో కవిత, చిట్టిబాబు, విజయ, సత్యవతి, సుశీలకు గాయాలు కావడంతో స్థానికులు 108 సహాయంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కామేపల్లి పోలీసులు చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.