ఖమ్మం : కేసీఆర్ పాలనలోనే కులవృత్తులకు సముచిత గౌరవం దక్కిందని టీఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పొట్లపల్లి రాజా అన్నారు. మత్యశాఖ ఆధ్వర్యంలో మండల పరిధి వేపకుంట్ల గ్రామంలోని రెండు చెరువుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులు ఆర్ధికాభివృద్దిని సాధించాలని వారు సూచించారు. వేపకుంట్ల ఉపసర్పంచ్ మేక స్వాతి, టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మల్లయ్య, లేళ్ల రాంబాబు, లేళ్ల లక్ష్మణ్, తోక శ్రీను, మత్స్యకారులు పాల్గొన్నారు.