ఇల్లెందు, ఆగస్టు 24: ఉరిమెళ్ల ఫౌండేషన్ వారు అక్షరాల తోవ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కథా రచయితలకు ఖమ్మంలోని బోడెపూడి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ పోటీల్లో ఇల్లెందు రచయిత సుదర్శనం రంగనాథ్ రచించిన మైలంటని మహాలక్ష్మి కథకు ప్రథమ బహుమతి వచ్చింది. ఈ సందర్భంగా బోడేపూడి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సాహితీ పురస్కార సభలో రంగనాథ్ ను ఉరిమెళ్ల ఫౌండేషన్ వారు సన్మానించారు.
మూమెంటో, ప్రోత్సాహక బహుమతి అందించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ ఈ సంస్థ నిర్వహించిన కథా పోటీలలో గతంలో ఎక్కిరింపు కథకు ప్రథమ బహుమతి వచ్చిందని, తెలుగు రాష్ట్రాలలో సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న ఉరిమెళ్ల ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు.