కారేపల్లి(కామేపల్లి)డిసెంబర్ 7: ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రానికి చెందిన ముక్తి సాంబశివరావు(మాజీ జర్నలిస్టు)అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. తోటి మిత్రుడు మృతి చెందడంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన అతని కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో 2000-2001 కామేపల్లి హైస్కూల్లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు సామినేని సునీల్, తాటిపల్లి నవీన్ కుమార్ లతో పాటు పూర్వ విద్యార్థులు తమకు తోచినంత ఆర్థిక సహకారం అందించారు.
రూ.57,500 ఆర్థిక సహాయాన్ని ఆదివారం సాంబశివరావు భార్య జ్యోతి, తండ్రి ముత్తయ్యకు నగదు రూపంలో అందజేశారు. ఆర్థిక సహాయం చేసిన వారిలో తెల్లబోయిన రాము, పగడాల పుష్ప, గుగులోతు దేవ్ సింగ్, నల్లమోతు రంగారావు, గంపల అచ్చి బాబు, కెసగాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.