కారేపల్లి, ఏప్రిల్ 2: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు షేక్ సాదిక్ అలీ రోడ్డు ప్రమాదానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. సుమారు నెలరోజుల పాటు దవాఖానలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు, సింగరేణి గ్రామపంచాయతీ 10వ వార్డు మాజీ సభ్యుడు షేక్ గౌసుద్దీన్ సాదిక్ ఆలీ ఇంటికి వెళ్లి పరామర్శించారు.
అదేవిధంగా ఐదువేల నగదు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులను అందజేశారు. అంతకు ముందు ఉద్యమకారుడు సాదిక్ ఆలీ ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కారేపల్లి గ్రామస్తులు దొంకెన్న రవీందర్, ఉద్యమకారుడు భూక్య చందు నాయక్, మైనార్టీ నాయకులు షేక్ మోసిన్, సద్దాం,అబ్దుల్ వాహద్, షేక్ యాసిన్, ఫిరోజ్, షేక్ మైబల్లి, అమీర్, ముస్తాక్, షేక్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.