కారేపల్లి, ఏప్రిల్ 27 : తెలంగాణ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ అండ్ సీడ్ డీలర్ల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా సోమవారం సింగరేణి మండలంలో ఎరువుల దుకాణాల బంద్ విజయవంతమైంది. ఎరువుల సరఫరాలో రవాణా చార్జీల భారం డీలర్లపై పడకుండా ప్రభుత్వమే భరించాలని, ఎరువుల కొనుగోలుకు లింకులు పెట్టవద్దని, వ్యవసాయ సీజన్‌కు సరిపడా ఎరువులను కొరత లేకుండా ప్రైవేట్ డీలర్లకు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ డీలర్ల అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌తో మండలంలోని అన్ని దుకాణాలు బంద్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి డీలర్ల సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అసోసియేషన్ మండల నాయకులు హెచ్చరించారు. ఈ బంద్‌కు రైతులు సైతం సంఘీబావం తెలిపారు. ఈ కార్యక్రమంలో డీలర్లు సురేందర్ మనియార్, రావూరి కిషన్‌రావు, భాగం నాగేశ్వరరావు, అజ్మీర నాగేశ్వరావు, అజ్మీర నరేన్, ముక్క సీతారాములు, కాటేపల్లి కార్తీక్, ఆంగోత్ వినోద్ కుమార్, గుగులోత్ మోహన్, గణేష్, రైతులు పాల్గొన్నారు.