హైదరాబాద్/సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారు. హైదరాబాద్‌లో మూడు టిమ్స్, వరంగల్ సూపర్ స్పె షాలిటీ దవాఖానకు బీఆర్ఎస్ హయాం లో కొబ్బరికాయ కొట్టి నిధులు, నిర్వహణ మర్చిపోయారంటూ అబద్ధాలు పలికారు. సోమవారం ఆయన సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం మా ట్లాడుతూ.. పదేండ్లయినా టిమ్స్ నిర్మాణా లు పూర్తి చేయలేదని ఆరోపించారు. వాస్తవానికి, నిజాం కాలంలో 100 ఏండ్ల క్రితం నిర్మించిన ఉస్మానియా, ఎంఎన్‌జె, నిలోఫర్ దవాఖానలు… 200 ఏండ్ల క్రితం సైనికుల కోసం బ్రిటిష్ వారు నిర్మించిన గాంధీ హాస్పిటల్ మినహా 75 ఏండ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఒక్కటంటే ఒక్క దవాఖాన కూడా నిర్మించిన పాపాన పోలేదు.
ఉమ్మడి రాష్ట్ర పాలకులు ప్రభుత్వ వై ద్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేసీఆర్ హయాంలో టిమ్స్ ద వాఖానలకు శ్రీకారం చుట్టారు. 2022 ఏప్రిల్ 26న ఒకేరోజు హైదరాబాద్ నగరంలో మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణ పనులకు శంకుస్థపన చేశారు. ఎల్బీనగర్, అల్వాల్, సనత్‌నగర్‌లో టిమ్స్ దవాఖానలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే రూ.2,679 కోట్లు నిధులు కూడా విడుదల చేసి, నిర్మాణ పనులు సైతం చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలోనే సనత్‌నగర్ టిమ్స్ పనులు 60% పూర్తయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఈ నాలుగు దవాఖానల నిర్మాణం నత్తనడకన సాగింది.
కాంగ్రెస్ సర్కార్ 32 నెలల తర్వాత ప్రారంభించిన సనత్‌నగర్ టిమ్స్‌లో పూర్తిస్థాయి పరికరాలు సమకూర్చలేదు. కేవలం ఓపీ సేవలకే కాంగ్రెస్ సర్కార్ పరిమితం చేసింది. నెలలోగా సర్జరీలు ప్రారంభించాలని ప్రభుత్వం చెప్తున్నా.. పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభానికి మరికొన్ని నెలలు పడుతుందని వైద్యారోగ్య వర్గాలు తెలిపా యి. వాస్తవానికి, గత మే నెల నుంచే టిమ్స్‌లో ఓపీ ట్రయల్న్ కొనసాగుతుండగా, ఆ సేవలనే సీఎం రేవంత్ మరోసారి ప్రారంభించినట్టయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 32 నెలల్లో ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2,700 కోట్లు చెల్లించినట్టు సీఎం చెప్పగా.. ఇప్పటికీ రూ.1,800 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. ఆ నిధుల విడుదల గురించి ప్రస్తావించలేదు. బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ప్రతి ఏడాదీ రూ.13 వేల కోట్లు బడ్జెట్ కేటాయి స్తే, ఇప్పటివరకు రూ.21,800 కోట్లు ఖర్చు చేసినట్టు సీఎం సభ సాక్షిగా చెప్పా రు. ఆ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు లేవని వైద్యారోగ్య వర్గాలు చెప్తున్నాయి.
నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో నాటి కేసీఆర్ ప్రభు త్వం పునాదులు వేసిన సనత్‌నగర్ టిమ్స్ ను రెండేండ్ల నిరీక్షణ అనంతరం కూడా అరకొర సౌకర్యాలతోనే ప్రారంభించడం స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ దవాఖానను కనీసం నీళ్లు కూడా లేకుండానే ప్రారంభించారు. మూడు నెలల క్రితమే ఓపీ సేవలు ప్రారంభించినా, నేటికీ సౌకర్యాలు కల్పించలేకపోయిందని దవాఖాన వర్గాలే ఆరోపిస్తున్నాయి. నీటి సరఫరా కోసం జలమండలికి బిల్లులు చెల్లించకపోవడంతో దవాఖానకు నీటి సరఫరాను ఇవ్వలేదని సమాచారం. దీంతో ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారానే నీటిని తెప్పించుకొంటున్నట్టు తెలిసింది. అయితే, మొన్నటివరకు ట్రయల్న్ ఉన్నందున పెద్దగా సమస్య తలెత్తలేదు. కానీ, ఇప్పుడు అధికారికంగా, పూర్తిస్థాయిలో దవాఖానను ప్రారంభించారు. ఇప్పుడు కూడా ట్యాంకర్ల ద్వారానే నీటిని తెచ్చుకొంటే ఇబ్బందులు తప్పవని టిమ్స్ సిబ్బంది చెప్తున్నారు. నీళ్లే కాకుండా పడకలు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను ఇంకా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదని, చాలావరకు వైద్య పరికరాలను సమకూర్చనేలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.