అసంపూర్తిగా అలుగు నిర్మాణం
మండలంలోని ప్రధాన సాగు నీటి వనరు వెంగళరావు సాగర్ ప్రాజెక్టు అలుగు నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ ప్రాజెక్టు పరిధిలోని సీతాయిగూడెం, దామరచర్ల, ఇమ్మడిరామయ్యబంజర, చండ్రుగొండ, తిప్పనపల్లి, మహ్మద్‌నగర్ గ్రామాలకు చెందిన 2,200 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి.
- మంత్రి హామీ ఇచ్చినా పూర్తికాని పనులు
- అధిక వర్షాలతో పంటలు మునుగుతాయని రైతుల ఆందోళన
చండ్రుగొండ, జూన్ 7 : మండలంలోని ప్రధాన సాగు నీటి వనరు వెంగళరావు సాగర్ ప్రాజెక్టు అలుగు నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ ప్రాజెక్టు పరిధిలోని సీతాయిగూడెం, దామరచర్ల, ఇమ్మడిరామయ్యబంజర, చండ్రుగొండ, తిప్పనపల్లి, మహ్మద్‌నగర్ గ్రామాలకు చెందిన 2,200 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి.
అనధికారికంగా మరో 500-600 ఎకరాల భూమి అదనంగా ఉంది. అలుగు నిర్మాణానికి ప్రభుత్వం గత ఏడాది రూ.33 కోట్లు మంజూరు చేసింది. ఈ ఏడాది మే చివరి నాటికి పనులు పూర్తవుతాయని, ఆయకట్టు సాగుకు ఇబ్బంది లేకుండా చేస్తామని రైతులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ గాల్లో కలిసింది. నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్.. పనులను అసంపూర్తిగా వదిలేశారు.
ఈ ఏడాది అధిక వర్షాలు పడితే పంటలు మునుగుతాయేమోనని ఆయకట్టు రైతులు భయాందోళనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో, పనులు పూర్తిచేయని సదరు కాంట్రాక్టర్‌కు ఇరిగేషన్ శాఖ అధికారులు నోటీస్ ఇచ్చారు. “పనులు పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్‌కు నోటీస్ ఇచ్చాం. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వరద ముంపు నుంచి ఆయకట్టు సాగు దెబ్బతినకుండా ఆరు అడుగుల రింగ్ బండ్ ఏర్పాటు చేస్తాం” అని, ‘నమస్తే తెలంగాణ’తో ఇరిగేషన్ శాఖ డీఈ సుబ్రహ్మణ్యం చెప్పారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

