హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 12 వర కు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాబోయే రెండురోజు లు గంటకు 30-40 కి.మీ. వేగంతో అన్ని జిల్లాల్లో అక్కడక్కడా బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కేంద్రం అధికారులు అంచనా వేశారు. రాబోయే 24 గంటలు ఆకా శం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, హైదరాబాద్లోని కొన్ని ప్రాంతా ల్లో చాలా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.