– భారీగా నిలిచిపోయిన వాహనాలు
– తడిచిన మొక్కజొన్నలు, వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్
తిరుమలయపాలెం, మే 04 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. గంటన్నరసేపు రాస్తారోకో నిర్వహించారు. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతు నాయకులతో మాట్లాడారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫోన్లో రైతులతో మాట్లాడారు. పంటలను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు బిల్లగిరి ధనుంజయ. చామకూరి రాజకుమార్. జక్కుల వీరన్న, గుంటి పుల్లయ్య, చిర్ర కృష్ణయ్య, వార్డు సభ్యులు రెడ్డిమల్ల నరేందర్, పులిగుజ్జు ఉపేంద్రమ్మ, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

ఖమ్మం- వరంగల్ జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో