తరుగు ఇవ్వండి.. లేదంటే బయట అమ్ముకోండి..
ధాన్యం తరుగు ఇవ్వండి.. లేదంటే బయటి మార్కెట్లో అమ్ముకోండి.. అని ఉచిత సలహా ఇవ్వడంతో అసహనానికి గురైన రైతులు సదరు అధికారిని నిలదీశారు. ఈ ఘటన అశ్వారావుపేటలో బుధవారం చోటు చేసుకుంది.
- ప్రత్యేకాధికారి ఉచిత సలహాతో తిరగబడ్డ అన్నదాతలు
అశ్వారావుపేట, ఏప్రిల్ 29: ధాన్యం తరుగు ఇవ్వండి.. లేదంటే బయటి మార్కెట్లో అమ్ముకోండి.. అని ఉచిత సలహా ఇవ్వడంతో అసహనానికి గురైన రైతులు సదరు అధికారిని నిలదీశారు. ఈ ఘటన అశ్వారావుపేటలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో ధాన్యం విక్రయానికి రైతులు 20 రోజులుగా రాశులు సిద్ధం చేశారు. అధికారులు కొద్ది రోజుల క్రితం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఫొటోలు దిగి.. మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు.
ఈ క్రమంలో రైతులు ఆందోళనకు సిద్ధమవుతుండగా.. అశ్వారావుపేట సొసైటీ ప్రత్యేకాధికారి రాజశేఖరరెడ్డి బుధవారం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చారు. దీంతో ఆయన వద్దకు వెళ్లిన రైతులకు 5 కేజీల తరుగు ఇవ్వాలని, లేదంటే బయట మార్కెట్లో అమ్ముకోండి అంటూ హుకుం జారీ చేశారు. అప్పటికే అసహనంతో ఉన్న రైతులు ఒక్కసారిగా సదరు అధికారిపై తిరగబడ్డారు. 20 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకుండా.. ఇప్పుడు వచ్చి తరుగు ఎలా తీయమంటారు అని నిలదీశారు.
రైతుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దీంతో సమాచారం అందుకున్న అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేశ్ అక్కడకు చేరుకున్నారు. రైతుల సమస్యలు విన్న ఆయన అదనపు కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. గత ఏడాది ధాన్యం ఎలా సేకరించారో అలాగే తీసుకోవాలని సూచించారు. దీంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

