మణుగూరు టౌన్, ఆగస్టు 23 : రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ కార్యాలయాల వద్ద ఈ నెల 25వ తేదీ సోమవారం ఆందోళనలు చేపడుతున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏవో ఆఫీసుల ఎదుట జరిగే ధర్నా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.