మధిర, ఆగస్టు 30 : సాగు చేసిన పంటలను రైతులు వ్యవసాయ శాఖ వద్ద నమోదు చేసుకోవాలని మధిర మండల వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్ అన్నారు. మధిర క్లస్టర్ లోని పంట నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతాంగం సాగు చేసిన పంటల వివరాలను ఈ నెల 28 నుంచి నమోదు చేస్తున్నట్లు తెలిపారు. రైతులందరూ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి వారి పంటను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ ఏడాది డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా పంట నమోదు చేయడం జరుగుతుందన్నారు. పంట నమోదు అనేది రైతు భరోసాకి తప్పనిసరి చేసినందున రైతులందరూ పంట నమోదు చేయించుకోవాలన్నారు. ఈ పంట నమోదు అక్టోబర్ 25 లోపు చేయించుకోవాలని పేర్కొన్నారు.