ఇంకెన్ని రోజులు కొంటరు?
కల్లాల్లో కాంటాలు వేసిన మొక్కజొన్న బస్తాలను 55 రోజులు దాటినా ఇంకా తరలించడం లేదని ఆరోపిస్తూ రైతులు చింతకాని సొసైటీ కార్యాలయ గేటుకు శుక్రవారం తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కల్లాల్లో కాంటాలు వేసి 55 దాటినా బస్తాలను ఇంకా తరలించడం లేదని, కొందరు అధికారులు అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు కొమ్ముకాస్తూ వారు చెప్పిన వారికే లారీలను పంపిస్తున్నారని ఆరోపించారు.
- ఆగ్రహంతో చింతకాని సొసైటీ గేటుకు తాళం వేసిన రైతులు
చింతకాని, మే 22 : కల్లాల్లో కాంటాలు వేసిన మొక్కజొన్న బస్తాలను 55 రోజులు దాటినా ఇంకా తరలించడం లేదని ఆరోపిస్తూ రైతులు చింతకాని సొసైటీ కార్యాలయ గేటుకు శుక్రవారం తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కల్లాల్లో కాంటాలు వేసి 55 దాటినా బస్తాలను ఇంకా తరలించడం లేదని, కొందరు అధికారులు అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు కొమ్ముకాస్తూ వారు చెప్పిన వారికే లారీలను పంపిస్తున్నారని ఆరోపించారు.
ట్రక్ షీట్లు ఇవ్వకుండా మిగిలిన రైతులను సొసైటీ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటాలు వేసి ఇన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నా ఇటు ప్రభుత్వం, అటు అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వాతావరణ పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియడం లేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి సరుకును తరలించేందుకు లారీలను పంపించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

