మధిర, ఆగస్టు 04 : మధిర డివిజన్ పరిధిలో బోనకల్లు, చింతకాని మండలాల రైతులకు ఆయిల్‌పామ్ సాగుపై, వ్యవసాయ ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో సోమవారం రైతు విజ్ఞాన యాత్ర నిర్వహించారు. ఈ రైతు విజ్ఞాన యాత్రలో సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో గల ఆయిల్‌పామ్ తోటలను రైతులు సందర్శించారు. ఈ సందర్బంగా మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు స్వర్ణ విజయ చంద్ర ఆయిల్ పామ్ సాగులో చేపట్టే యాజమాన్య పద్ధతులు, పొందే ప్రయోజనాలు వివరించారు. ఆయిల్ పామ్‌లో సాగు చేస్తున్న రైతులు అంతర పంటలుగా వక్క, మిరియాలు, కోకో వంటి వాటిని సాగు చేస్తూ పొందే ఆదాయం గురించి తెలియజేశారు. అనంతరం దమ్మపేట మండలంలో గల అప్పారావుపేట నందు గల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించారు.
ఈ కార్యక్రమంలో బోనకల్లు, చింతకాని మండల వ్యవసాయ అధికారులు పసునూరి వినయ్ కుమార్, సోములపల్లి మానస, మధిర ఉద్యాన వన అధికారి విష్ణు, వ్యవసాయ విస్తరణ అధికారులు బంధం రజిత, మరీదు త్రివేణి, గోగుల హరికృష్ణ, నాగినేని నాగసాయి, బోయినపల్లి రాము, మురికిపుడి తేజ, బద్దల కార్తీక్, ధారగాని కళ్యాణి, షేక్ అయేషా, ఫాతిమా, ఎండీ తాహియా నౌషీన్, ఆయిల్ పామ్ ఏరియా అధికారి బి.నరేశ్, రైతులు పాల్గొన్నారు.