ఖమ్మం, మే 16 : యాసంగిలో రైతులు పండించిన ధాన్యం మద్దతు ధరతో చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌తో కలిసి ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి వీసీలో పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, జిల్లా సహకార అధికారి గంగాధర్, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య, జిల్లా మారెటింగ్ అధికారి ఎంఏ.అలీమ్, అధికారులు పాల్గొన్నారు.