ప్రజాధనంతో రాజకీయ ప్రచారం
చింతకాని మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’కు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని జడ్పీ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు లింగాల కమల్రాజు ఆరోపించారు. మంగళవారం చింతకాని గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
- రైతు ఆశీర్వాద సభతో రైతులకు ఒరిగిందేమీ లేదు
- భట్టి ‘దళితబంధు’ను ఎందుకు అమలుచేయడం లేదు?
- మాజీ సీఎం కేసీఆర్ను విమర్శించేందుకే కాంగ్రెస్ సభ
- జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు మండిపాటు
చింతకాని, జూలై 14 : చింతకాని మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’కు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని జడ్పీ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు లింగాల కమల్రాజు ఆరోపించారు. మంగళవారం చింతకాని గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు ఆశీర్వాద సభతో రైతులకు ఒరిగిందేమీలేదని, కేవలం రాజకీయ ప్రచారం కోసమే సభ నిర్వహించారని అన్నారు. రైతుల సమస్యలకు పరిషారాలు చూపాల్సిన ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేసి, కేసీఆర్పై విమర్శలు చేయడానికే సభను వేదికగా ఉపయోగించుకుందని మండిపడ్డారు.
సభ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,400 ఆర్టీసీ బస్సులను వినియోగించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని, వేదిక, టెంట్లు, రోడ్లు, హెలికాప్టర్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పలుమార్లు సభా ఏర్పాట్లను పరిశీలించేందుకు రావడం, వాటితో కలిపి రూ.50 కోట్లకు పైగా ప్రజాధనం వ్యయం చేశారని కమల్రాజు ఆరోపించారు. అదే నిధులతో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించవచ్చని, రైతుల రుణమాఫీ, మహిళల సంక్షేమం, రైతుల సమస్యల పరిషారానికి వినియోగించవచ్చన్నారు. సభకు మూడు లక్షల మంది వస్తారని ప్రచారం చేసినప్పటికీ అనేక బస్సుల్లో ఐదుగురికి మించి ప్రయాణించలేదని పేర్కొన్నారు.
డ్వాక్రా మహిళలు, ఐకేపీ సభ్యులు, ఇతర మహిళా సంఘాల సభ్యులను సభకు తీసుకురాకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని గ్రామస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారని, అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజలు హాజరుకాలేదన్నారు. కేసీఆర్పై బురదజల్లే రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతోందని విమర్శించారు. చింతకాని మండలాన్ని దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించిన సమయంలో దళితబంధు నేనే తీసుకొచ్చాను అంటూ ప్రచారం చేసుకున్న భట్టి విక్రమార, నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మిగిలిన లబ్ధిదారులకు దళితబంధు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు.
దళితులకు భట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యూరియా సమస్యను కూడా పరిషరించలేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. రైతుల సమస్యలను పకనపెట్టి కేసీఆర్ను విమర్శించడానికే రైతు ఆశీర్వాద సభను ఉపయోగించుకున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు మరోసారి కేసీఆర్ నాయకత్వానికే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మంకెన రమేష్, బొడ్డు వెంకటరామారావు, పొనుగోటి రత్నాకర్, వంకాయలపాటి లక్ష్మయ్య, గడ్డం శ్రీను పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

