ధాన్యం, మక్కల కొనుగోళ్లు చేపట్టండి..
ధాన్యం, మొక్కజొన్న పంట ఉత్పత్తులు చేతికొస్తున్న తరుణంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, తెలంగాణ రైతు సంఘం, రైతుల ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం, కొణిజర్ల, పెనుబల్లి మండల కేంద్రాల్లో శనివారం ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు.
- ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్
- బీఆర్ఎస్, తెలంగాణ రైతు సంఘం, రైతుల ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు
తిరుమలాయపాలెం/ వైరా టౌన్/ పెనుబల్లి ఏప్రిల్ 18 : ధాన్యం, మొక్కజొన్న పంట ఉత్పత్తులు చేతికొస్తున్న తరుణంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, తెలంగాణ రైతు సంఘం, రైతుల ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం, కొణిజర్ల, పెనుబల్లి మండల కేంద్రాల్లో శనివారం ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
పెనుబల్లి తహసీల్, ఐకేపీ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. తహసీల్దార్ వీరభద్రనాయక్కు, ఐకేపీ ఏపీఎం కల్పనకు వినతిపత్రాలు అందజేశారు. కొణిజర్లలోని రాష్ట్రీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం గోపారం సొసైటీ కార్యాలయం వద్ద అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు.
ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకుడు బిళ్లగిరి ధనుంజయ, తాళ్లచెరువు సర్పంచ్ గడిపుడి వెంకటనారాయణ, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు చిట్టిమోదు కృష్ణయ్య తదితరులు మాట్లాడారు. పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారని, కొందరు దళారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిలో గన్నీ సంచులు, రైతులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
లేదంటే కేంద్రాలు ఏర్పాటు చేసే వరకు దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు చిర్రా కృష్ణయ్య, జక్కుల వీరన్న, కాంగ్రెస్ నాయకుడు దొడ్డా గురువయ్య, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు చలమాల విఠల్రావు, కార్మిక సంఘం నాయకులు గాయం తిరుపతిరావు, తాండ్ర రాజేశ్వరరావు, తడికమళ్ల చిరంజీవి, మల్లెల్లి శ్రీను, వంగా రాము తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

