ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ కుటిల పన్నాగాలు పన్నుతున్నది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ను జీర్ణించుకోలేకపోతున్నది. రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ.. అవగాహన లేని మాటలు మాట్లాడడంపై కర్షక లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవసాయాన్ని పండుగ చేస్తున్న రైతులంతా ఆయన మాటలను తిప్పికొట్టాలని, కాంగ్రెసోళ్ల నోటికి తాళం వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు రైతు వేదికల వద్ద రేవంత్ వ్యాఖ్యలపై మండి పడ్డారు. వి.వెంకటాయపాలెం రైతు వేదికలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, టేకులపల్లి మండలం కోయగూడెంలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, ఏన్కూరులో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్.. కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టారు.
-నమస్తే నెట్వర్క్
టేకులపల్లి, జూలై 18: ‘మూడు పంటలకు ఉచిత విద్యుత్ కావాలా? మూడు గంటల విద్యుత్ కావాలా? అనే విషయంలో కాంగ్రెస్ కరెంట్ కుట్రలను రైతులు తిప్పికొట్టాలి’ అని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పిలుపునిచ్చారు. మండలంలోని ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కోయగూడెం రైతువేదికలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్‌గౌడ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన రైతుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ తొమ్మిదేళ్లలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ రైతులందరినీ సీఎం కేసీఆర్ రాజులుగా చేస్తున్నారని గుర్తుచేశారు. దీనిని ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఉచిత కరెంటు వద్దంటూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని అన్నారు. అన్నదాతలెవరూ వారి మాటలను నమ్మవద్దని సూచించారు. రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చిన కేసీఆర్‌కు అండగా ఉంచాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మాలోత్ సురేందర్, అజ్మీరా గలక, భూక్యా బాలకృష్ణ, లక్కినేని శ్యామ్‌బాబు, బొమ్మెర్ల వరప్రసాద్‌గౌడ్, బోడా బాలూనాయక్, బానోత్ రామానాయక్, కిషన్‌నాయక్, చీమల సత్యనారాయణ, బర్మవత్ శివకృష్ణ, బానోత్ రవికుమార్, అనంతుల శ్రీనివాస్, ఉండేటి బసవయ్య, కాలే ప్రసాద్, మాలోత్ పూల్‌సింగ్, ఆంతోటి రాకేశ్ పాల్గొన్నారు.