Haripriya | ఇల్లెందు, జూలై 13 : ఆషాఢ మాసం మూడవ ఆదివారం బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని ఇల్లందు పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయం నందు ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బానోత్ హరిప్రియ నాయక్, దిండిగాల రాజేందర్ పార్టీ శ్రేణులతో కలిసి అమ్మవారి ఆలయం నందు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఇల్లందు మున్సిపాలిటీ రెండో వార్డు మాజీ కౌన్సిలర్ కటకం పద్మావతి ఆహ్వానం మేరకు చెరువు కట్ట శ్రీ కాళీమాత అమ్మవారికి మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ స్వయంగా బోనమెత్తి శివసత్తులతో కలిసి భక్తుల ఆనందోత్సవాల మధ్య అమ్మవారికి బోనాన్ని సమర్పించి, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ.. ఆ అమ్మవారి ఆశీస్సులు ఇల్లందు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండే ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యమ సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ, ఇల్లందు పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి,TBGKS ఇల్లందు ఏరియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జాఫర్ హుస్సేన్, సోషల్ మీడియా, యువజన విభాగం గిన్నారపు రాజేష్, సత్తాల హరికృష్ణ, కాసాని హరి ప్రసాద్ యాదవ్, సోషల్ మీడియా మరియు, యువజన విభాగం నాయకులు ఎంటెక్ మహేందర్, మున్సిపల్ మాజీ వార్డ్ కౌన్సిలర్లు వాంగుడోత్ తార, ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, ఉపాధ్యక్షురాలు కడగళ్ల నారాయణమ్మ, పింక్ లోదు, మదర్ బి, కుమారి మౌనిక, ఇల్లందు పట్టణ యువజన నాయకులు ఎస్.కె చాంద్ పాషా, చిన్నారి నెమలి, నిఖిల్, వార రమేష్, బోల్ల గోపి, రఘువీర్ రెడ్డి, కొండూరు రవికాంత్ దుంపటి కృష్ణయ్య, బజారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.