వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళనలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సబ్ స్టేషన్ల ఎదుట రేవంత్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. కాంగ్రెస్, రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సత్తుపల్లి మండలం గంగారం సబ్‌స్టేషన్ వద్ద ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎర్రుపాలెం సబ్‌స్టేషన్ వద్ద జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఖమ్మం నగరంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్‌లో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
-నమస్తే నెట్వర్క్
ఖమ్మం, జూలై 13: అన్నదాతల పంటల సాగు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటు ఇస్తుండడం కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా ఉందని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్ విమర్శించారు. అందుకే వారు ఉచిత విద్యుత్‌ను అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డు సబ్ స్టేషన్ వద్ద గురువారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దానిని దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 24 గంటల ఉచిత కరెంటును చూస్తుంటే కాంగ్రెస్ నేతలకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. మూడు గంటల విద్యుత్ చాలంటూ వ్యాఖ్యలు చేసినప్పుడే రైతుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏంటో తేలిపోయిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, నాగచంద్రారెడ్డి, కొత్తపల్లి నీరజ, లక్ష్మి, జ్యోతిరెడ్డి, కోటేశ్వరరావు, మక్బూల్, వలరాజు, తిరుపతిరావు, కిశోర్, తాజుద్దీన్, మాటేటి కిరణ్‌కుమార్, భాస్కర్, శోభారాణి, షకీనా, కృష్ణ, పాషా, శేషగిరి, ఉపేందర్, ప్రసన్నకృష్ణ, రమేశ్, లక్ష్మణ్‌గౌడ్, ముజాహిద్, సలీం, దయాకర్, లింగరాజు, అప్పారావు, రవి, మురళీకృష్ణ, వెంకటరమణ, సాయికిరణ్, శమ్మి, వెంకటేశ్, అనిల్, భిక్షం, ఫ్రాన్సిస్, చోటు, జానీ, మోటె కుమార్ తదితరులు పాల్గొన్నారు.