Rajpal Yadav | రాజ్‌పాల్ యాదవ్‌కు అండగా సోనూ సూద్.. పరిశ్రమ మొత్తం కలిసి నిలబడాలని పిలుపు!
Sonu Sood | బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన దాతృత్వంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆర్థిక ఇబ్బందులు, చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు తాను అండగా ఉంటానని సోన్‌సూద్ ప్రకటించాడు.
Sonu Sood | బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన దాతృత్వంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆర్థిక ఇబ్బందులు, చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు తాను అండగా ఉంటానని సోన్‌సూద్ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. రాజ్‌పాల్ యాదవ్ మన పరిశ్రమకు ఎన్నో ఏళ్లుగా మర్చిపోలేని అద్భుతమైన పాత్రలను అందించాడు. కొన్నిసార్లు ప్రతిభ ఉన్నప్పటికీ, సమయం అనుకూలించక జీవితం ఇలాంటి కఠిన పరీక్షలు పెడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తదుపరి చిత్రంలో రాజ్‌పాల్ యాదవ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా సోనూ సూద్ వెల్లడించారు.
ఈ కష్టసమయంలో నిర్మాతలు, దర్శకులు మరియు సహచర నటులందరూ కలిసికట్టుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని.. భవిష్యత్తులో చేయబోయే పని కోసం ఇచ్చే ముందస్తు అడ్వాన్స్ (Signing Amount) అనేది దాతృత్వం కాదని, అది ఒక నటుడి గౌరవాన్ని కాపాడటమేనని సోనూ సూద్ పేర్కొన్నారు. మన పరిశ్రమలోని వ్యక్తి ఇలాంటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, తను ఒంటరి కాదని గుర్తు చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. మనం కేవలం ఒక గ్లామర్ పరిశ్రమ మాత్రమే కాదు, ఒకరికొకరు తోడుగా నిలిచే కుటుంబం అని నిరూపించుకోవాలని సోనూ సూద్ రాసుకోచ్చాడు.
Rajpal Yadav is a gifted actor who has given years of unforgettable work to our industry. Sometimes life turns unfair, not because of talent, but because timing can be brutal. He will be part of my film, and I believe this is the moment for all of us..producers, directors,…
— sonu sood (@SonuSood) February 10, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

