Newton’s 3rd Law | సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం న్యూటన్స్ థర్డ్ లా (Newton’s 3rd Law). ‘ఏజెంట్ ఆఫ్ కర్మ’ అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. ఫిజిక్స్ సూత్రం ‘చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను కర్మ సిద్ధాంతంతో ముడిపెడుతూ ఈ చిత్రాన్ని ఒక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు మేకర్స్. సుమంత్ తన కెరీర్లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తుండగా, ఈ చిత్రంపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’ (ETV Win) ఒరిజినల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం మే 15న థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రీ యాక్షన్ వీడియోను వదిలింది.
రాజేష్ కర్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుమంత్ సరసన నేహా పఠాన్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీనివాస్ అవసరాల, రవి వర్మ, త్రినాధ్ వర్మ, కార్తీక్ రత్నం, అభినయ, షెల్లీ ఎన్ కుమార్, గౌతమ్ పండిట్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. మార్క్ మై వర్డ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై హరీష్ కోహిర్కర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సింజిత్ ఎర్రమిల్లి సంగీతాన్ని అందించగా, వేదవ్యాస్ గొట్టిపాటి సినిమాటోగ్రఫీ, అనిల్ పసల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. 1999 నేపథ్యంలో సాగే ఈ కథలో భీకరమైన యాక్షన్ సీక్వెన్స్‌లను వింగ్ చున్ అంజి పర్యవేక్షణలో రూపొందించారు.
Here comes the Agent of Karma 🔥🔥
Every action has a reaction⚖️
And this time, there’s no escape🚫🎬 In theatres this MAY 15th
Cast & Crew:@iSumanth @Sri_Avasarala @tweetravivarma @ktrinadhvarma @Neha_pathan3 @etvwin @markmywordsent @Rajesh__Karna @iVedaVyasG @prabhucs18… pic.twitter.com/vsuY8WZVlv
— ETV Win (@etvwin) February 9, 2026