మాదక ద్రవ్యాలను నిరోధించడంపైనే దృష్టి
రాష్ట్రంలో మావోయిస్టుల వ్యవస్థ లేకుండా మట్టుపెట్టామని, ప్రస్తుతానికి మాదక ద్రవ్యాల రవాణా, నిరోధించడంపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. మణుగూరు పోలీస్‌స్టేషన్ నూతన భవనాన్ని సోమవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
- డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు ఈగల్ ఫోర్స్ విభాగం
- మణుగూరు ఠాణా నూతన భవన ప్రారంభోత్సవంలో డీజీపీ సీవీ ఆనంద్
మణుగూరు టౌన్, జూలై 6: రాష్ట్రంలో మావోయిస్టుల వ్యవస్థ లేకుండా మట్టుపెట్టామని, ప్రస్తుతానికి మాదక ద్రవ్యాల రవాణా, నిరోధించడంపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. మణుగూరు పోలీస్‌స్టేషన్ నూతన భవనాన్ని సోమవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు సమాజాన్ని పూర్తిగా వినాశనం చేసే పరిస్థితులు ఉన్నాయని, వాటిని నియంత్రించేందుకు కార్యాచరణ రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈగల్ ఫోర్స్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు హోంగార్డు నుంచి డీజీపీ వరకు పటిష్టమైన వ్యవస్థ ద్వారా పోరాటం సాగిస్తున్నామన్నారు. ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు తమ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. పోలీస్‌స్టేషన్‌కు సమస్యలు చెప్పుకునేందుకు, ఫిర్యాదులు సమర్పించేందుకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.
కాగా, నిధుల కొరత సమస్యతో నిలిచిన మణుగూరు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ రోహిత్‌రాజు ప్రత్యేక చొరవ, సింగరేణి సంస్థ తోడ్పాటు, ప్రజల సంపూర్ణ సహకారంతో ప్రారంభించుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఐజీ చంద్రశేఖర్, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ నాగబాబు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

