
ఖమ్మం: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకోసం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమం నగరంలో కొనసాగుతుంది. ఖమ్మం నగరంలోని 1040 మంది నిరుపేదలకు టేకులపల్లిలో డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి వారితో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ దసరా రోజున గృహ ప్రవేశాలు చేయించిన సంగతి తెలిసిందే. నగరంలోని అన్ని డివిజన్లలో కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకుల ఆద్వర్యంలో లబ్దిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. నగరంలోని 17, 27వ డివజన్లలో టిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్డెల్లి లెనిన్, విఆర్ఓ సాయిరాం ల ఆధ్వర్యంలో 40 మందికి పట్టాలు పంపిణీ చేశారు.