అశ్వారావుపేట, మే 12 : మేము ఇందిరమ్మ ఇండ్లకు అర్హులం కాదా? తొలుత అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేరాయిగూడెంలో సీసీ రోడ్లు, చెన్నాపురంలో రూ.1.07 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ సందర్శనకు బయలుదేరిన ఎంపీ, ఎమ్మెల్యే కావడిగుండ్ల గ్రామంలో రోడ్డు పక్కన మహిళలను గమనించి ఆగారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై మహిళలు వారిని నిలదీశారు. స్పందించిన ఎమ్మెల్యే ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు.
ఇందులో ఎవరైనా అనర్హులు ఉంటే చెప్పాలని కోరగా.. వాళ్ల గురించి మాకు అనవసరం.. మాకు ఎందుకు ఇండ్లు మంజూరు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో వారం, పది రోజుల్లో ఎమ్మెల్యే ప్రత్యేక కోటా కింద 5 ఇండ్లు మంజూరు చేస్తానని, మిగతా అర్హులకు దశలవారీగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ వనం కృష్ణప్రసాద్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేశ్, తుమ్మా రాంబాబు, చిన్నంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.