సత్తుపల్లి, జనవరి 7: రజకుల అవసరాల నిమిత్తం వేంసూరు రోడ్లో రూ.1.50 కోట్లతో మోడ్రన్ దోబీఘాట్, ఫంక్షన్‌హాల్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో రజక సంఘ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రజకులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని, దీనిలో భాగంగానే మోడ్రన్ దోబీఘాట్లు, విద్యుత్ రాయితీలు కల్పిస్తున్నారన్నారు. రజకుల సమావేశాలకు, శుభకార్యాలకు వినియోగించుకునేలా ఈ దోబీఘాట్, ఫంక్షన్‌హాల్‌ను నిర్మిస్తామన్నారు. సమావేశంలో రజక సంఘ నాయకులు బెల్లంకొండ రాము, నిమ్మటూరి రామకృష్ణ, చింతల సత్యనారాయణ, మరికంటి శ్రీను, కృష్ణయ్య పాల్గొన్నారు.
సత్తుపల్లి టౌన్, జనవరి 7: ఆల్ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను శనివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆల్‌మేవా రాష్ట్ర అధ్యక్షుడు ఆదిల్ షరీఫ్, రాష్ట్ర కార్యదర్శి అజగర్ఖాన్, జిల్లా కార్యదర్శులు బాషావలీ, రఫీ, ఖలీల్, దస్తగిరి, కాజా, రషీద్, సలీమ్ పాల్గొన్నారు.
సత్తుపల్లి, జనవరి 7: సండ్ర సైన్యం ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, దొడ్డా శంకర్రావు, రఫీ, వల్లభనేని పవన్, మధు, అద్దంకి అనిల్, కోనేరు నాని, కృష్ణారావు పాల్గొన్నారు.
సత్తుపల్లి టౌన్, జనవరి 7: 1104 ఎలక్ట్రిసిటీ యూనియన్ ముద్రించిన క్యాలెండర్, డైరీని శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఎస్వీ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ స్రవంతి, కోశాధికారి రాము, నాయకులు పవన్, రామారావు, సోమయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.