బోనకల్లు, సెప్టెంబర్ 12 : వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిస్ట్రిక్ట్ మలేరియా అధికారి(డీఎంవో) డాక్టర్ వెంకటరమణ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని గురువారం సందర్శించిన ఆయన.. పలు రికార్డులను పరిశీలించారు. డ్రై డే, ఫీవర్ సర్వే తదితర కార్యక్రమాలపై డాక్టర్ స్రవంతిని అడిగి తెలుసుకున్నారు.
డెంగ్యూ పాజిటివ్ కేసులు వచ్చిన వాటి ఇంటి పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి రోజూ ఫీవర్ సర్వే, ప్రతి శుక్ర, మంగళవారాల్లో గ్రామాల్లో డ్రై డే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున ప్రజలు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంవో వెంకట్రావుయాదవ్, డాక్టర్ స్రవంతి, సీహెచ్‌వో శ్రీనివాసరావు, సూపర్వైజర్ దానయ్య, నర్సింగ్ ఆఫీసర్ ఉదయశ్రీ, ఫార్మాసిస్ట్ రాధాలత, స్టాఫ్‌నర్స్ రమాదేవి పాల్గొన్నారు.