తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉత్సవాల్లో పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ అక్కడి అమరవీరుల స్తూపం వద్ద పూలు చల్లి ఉద్యమకాలాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంపై కూడా పూలు చల్లారు. ఈ వేడుకల్లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు తదితరులు పాల్గొన్నారు.